: అసంతృప్త నేత‌ల‌ను బుజ్జ‌గిస్తున్న చంద్ర‌బాబు!


ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ జ‌రగ‌నున్న నేప‌థ్యంలో అసంతృప్తిగా ఉన్న నేత‌ల‌ను ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు బుజ్జ‌గిస్తున్నారు. ప‌లువురు నేత‌లకు ఫోన్ చేసిన చంద్ర‌బాబు వారికి న‌చ్చ‌జెబుతున్నారు. ముఖ్య‌ నేత‌లతో ఆయ‌న విడివిడిగా మాట్లాడుతూ చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. మంత్రివ‌ర్గం కూర్పుపై ఈ రోజు రాత్రి స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశం ఉంది. చంద్ర‌బాబు నివాసానికి కొద్దిసేప‌టి క్రితం జ్యోతుల నెహ్రూ చేరుకున్నారు. మంత్రివర్గ విస్తరణపై సీఎం నివాసంలో ఇప్పటికే సీనియర్‌ నేతలు చంద్రబాబుతో చ‌ర్చించారు. ఈ భేటీలో యనమల, కళా వెంకట్రావు, ధూళిపాళ్ల నరేంద్ర, మృణాళిని, బొజ్జల పాల్గొన్న విష‌యం తెలిసిందే. 

  • Loading...

More Telugu News