: బాలీవుడ్ నటుడు జీతూవర్మపై రాళ్లతో దాడి
ఓ కార్యక్రమానికి వెళ్లి జయపుర మీదుగా తిరిగి ప్రయాణిస్తోన్న బాలీవుడ్ నటుడు జీతూవర్మపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. ‘సోల్జర్’, ‘సన్ ఆఫ్ సర్దార్’, ‘బోల్ బచ్చన్’ చిత్రాల్లో ఆయన నటించి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. జీతూవర్మ ఆ ప్రాంతం గుండా ప్రయాణిస్తోన్న సమయంలో కారుపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వడంతో అతడికి తీవ్రగాయాలయ్యాయి. ఈ దాడి ఎందుకు జరిగిందన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. గాయపడిన జీతూని ముంబయి ఆసుపత్రికి తరలించిన ఆయన సోదరుడు మనోహర్ ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఆ రాళ్లదాడిలో జీతూ కన్ను బాగా దెబ్బతిన్నదని డాక్టర్లు తెలిపారు. ఆయన చూపు సరిగా కనిపిస్తుందో లేదో చెప్పలేమని పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.