: నాకు కాదు.. ఎమ్మెల్యేలను షాపింగ్ చేసిన గడ్కరీకి థ్యాంక్స్ చెప్పుకో: పారికర్ కు దిగ్విజయ్ చురకలు
ఇటీవల నిర్వహించిన గోవా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీజేపీ కంటే అధిక స్థానాలు గెలుచుకున్నప్పటికీ సర్కారు ఏర్పాటు చేయడంలో విఫలమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తనకి థ్యాంక్స్ అంటూ గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ చురకలు అంటించిన అంశంపై ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దిగ్విజయ్‌సింగ్ స్పందించారు. మనోహర్ పారికర్ గోవా ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.
అయినా థ్యాంక్ చెప్పాల్సింది తనకు కాదని, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి చెప్పాలని ఆయన అన్నారు. ఆ రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటు కోసం గడ్కరీ ఎమ్మెల్యేలను షాపింగ్ చేశారని ఆయన అన్నారు. అందుకే ఆయనకు పారికర్ ధన్యవాదాలు చెబితే బాగుంటుందని చురకలు అంటించారు. అధికార దాహంతో బీజేపీ అధిష్ఠానం ఆ రాష్ట్రంలో ఎమ్మెల్యేలను కొన్నారని ఆయన ఆరోపించారు. అది సిగ్గుచేటు చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు ఆ రాష్ట్ర ప్రజలను మోసం చేశారని, వాళ్లకు క్షమాపణలు చెప్పాలని అన్నారు.
If he has to thank anyone it is Nitin Gadkari who did aggressive MLA Shopping on 12th March early morning from Hotel in Goa
— digvijaya singh (@digvijaya_28) April 1, 2017
And Governor Goa who violated Constitution Sarkaria Commission guideline & Supreme Court decisions and robbed the mandate of People of Goa
— digvijaya singh (@digvijaya_28) April 1, 2017