: ఆరడుగుల కటౌట్ హల్ చల్.. దటీజ్ నయనతార అంటున్న అభిమానులు!


హీరోయిన్ నయనతారకు ప్రేక్ష‌కుల్లో ఉన్న ఫాలోయింగ్ ఏంటో తెలుసుకోవాలంటే చెన్నై మౌంట్ రోడ్ లో ఉన్న ఆల్బర్ట్ సినిమాస్ థియేటర్ వ‌ద్ద‌కు వెళ్లి చూడాల్సిందే. అక్క‌డ ఆమె అభిమానులు ఏర్పాటు చేసిన పోస్టర్స్ , కటౌట్స్ ఆమె స‌త్తా ఏ పాటిదో నిరూపిస్తున్నాయి. తాజాగా నయనతార న‌టించిన‌ 'డోర' చిత్రం నిన్న తెలుగు, త‌మిళంలో విడుద‌లైన విష‌యం తెలిసిందే. వేలాది మంది అభిమానులు ఈ సినిమా విడుదల రోజు థియేటర్ల దగ్గర ఆడిపాడారు. ఆ సినిమా రిలీజ్ సందర్భంగా ఆల్బర్ట్ సినిమా థియేటర్ లో నయనతార ఆరు ఫీట్ల భారీ కటౌట్ ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ క‌టౌటే సినీ అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. సి‌నీ చ‌రిత్ర‌లో ఓ హీరోయిన్‌కి ఇంత పెద్ద కటౌట్ ఏర్పాటు చేయడం తొలిసారని విశ్లేష‌కుల అభిప్రాయం. ఈ కటౌట్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. 'న‌య‌న‌తార స‌త్తా అంటే ఇదీ మ‌రి' అంటూ ఆమె అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.


  • Loading...

More Telugu News