: మంత్రివర్గంలో చోటు కోసం టీడీపీ ఎమ్మెల్యేల విశ్వప్రయత్నాలు
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో మార్పులు చోటు చేసుకోబోతున్న విషయం తెలిసిందే. మరో రెండు రోజుల్లో మంత్రివర్గ విస్తరణ జరగనుండడంతో టీడీపీ ఎమ్మెల్యేలు మంత్రిపదవిని దక్కించుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు తమ పదవిని తీయొద్దంటూ మంత్రులు కూడా అధిష్ఠానానికి విన్నవించుకుంటున్నారు. ప్రస్తుతం అమరావతి అసెంబ్లీ ప్రాంగణంలోని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప చాంబర్‌లో టీడీపీ యువనేత నారా లోకేశ్ ఉన్నారు. చినరాజప్ప, లోకేశ్ ఇద్దరూ కలిసి భోజనం చేశారు. దీంతో చినరాజప్ప ఉన్న ఛాంబర్‌కు పదవీగండం ఉన్న మంత్రులు క్యూ కట్టారు. మరోవైపు మంత్రివర్గంలో చోటు కోసం పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా అక్కడకు చేరుకుంటున్నారు. కాగా, ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా పలువురు, ఎమ్మెల్యేలు, పదవీ గండం ఉన్న మంత్రులు కలిశారు.