: రైతే ముఖ్యమంత్రి కావడం మన అదృష్టం: కేటీఆర్
ఒక రైతే ముఖ్యమంత్రి కావడం మన అదృష్టమని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. కేసీఆర్ మనసున్న ముఖ్యమంత్రి అని ఆయన పేర్కొన్నారు. ఈ రోజు పెద్దపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... జిల్లాను సస్యశ్యామలం చేసే బాధ్యత తమ సర్కారుదేనని అన్నారు. పెద్దపల్లి పట్టణ అభివృద్దికి రూ.50 కోట్ల నిధులు విడుదల చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ అంటే గతం అని, టీఆర్‌ఎస్ అంటే భవిష్యత్ అని ఆయన వ్యాఖ్యానించారు. 60 ఏళ్లుగా రాష్ట్రానికి పట్టి ఉన్న దరిద్రం కేవలం మూడేళ్లలో మాయమవడానికి కాంగ్రెస్, టీడీపీలు ఏమైనా అద్భుతదీపం ఇవ్వలేదు కదా? అని ఆయన అన్నారు. ప్రజల సమస్యలను తీర్చుతూ టీఆర్ఎస్ ముందుకు వెళుతోందని పేర్కొన్నారు.