: రైల్వేస్టేషన్‌లో అభిమానుల‌ను సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తిన హాలీవుడ్‌ సింగర్‌


హాలీవుడ్‌ ప్రముఖ సింగర్ జాన్‌ లెజెండ్ (38) ప్యారిస్‌ నుంచి తిరిగి వ‌స్తూ త‌న అభిమానుల‌ను రైల్వేస్టేష‌న్‌లోనే అల‌రించాడు. రైల్వేస్టేష‌న్‌లో అడుగుపెట్ట‌గానే ఆయ‌న‌ అక్క‌డే కచేరి కార్యక్రమం పెట్టడంతో అక్క‌డి ప్ర‌యాణికులు ఆశ్చ‌ర్యంలో మునిగిపోయారు. ఎవ‌రూ ఊహించ‌ని విధంగా రైల్వేస్టేష‌న్‌లో ఆడిపాడాడు. ఆర్డినరీ పీపుల్‌, ఆల్‌ ఆఫ్‌ మి అనే రెండు గీతాలను అద్భుతంగా పియానో వాయిస్తూ పాడి త‌న అభిమానులను సంతోషపెట్టాడు. కాసేపు అక్క‌డ ఆడిపాడిన ఆయ‌న అనంత‌రం త్వరలో తన డార్క్‌నెస్‌ అండ్‌ లైట్‌ అనే ఆల్బం విడుదల కాబోతున్నట్లు చెప్పి వెళ్లిపోయాడు.

  • Loading...

More Telugu News