: ములాయం సింగ్ యాదవ్ చిన్న కుమారుడి ఇంటికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ రోజు సమాజ్‌వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ చిన్న కుమారుడు ప్రతీక్ యాదవ్ ఇంటికి వెళ్లనున్నారు. తన రాజకీయ శత్రువు ఇంటికి సీఎం వెళ్లడానికి ప్రత్యేక కారణం వుంది. ఆదిత్యనాథ్ కు గోవులంటే ఎంతో ఇష్టమన్న విషయం తెలిసిందే. అలాగే ప్రతీక్ కు కూడా గోవులంటే ఇష్టం. ఆయన నిర్వహిస్తున్న గోశాలలో ఎన్నో గోవులున్నాయి. 'కన్హా ఉపవాన్' పేరుతో తాను నడుపుతున్న గోశాలను సందర్శించాల్సిందిగా ముఖ్యమంత్రిని ప్రతీక్ ఆహ్వానించాడు. దీంతో యోగి ఆదిత్యనాథ్ ఆ గోశాలను సందర్శించనున్నారు. ఈ సందర్భంగా ప్రతీక్, ఆయన భార్య అపర్ణా యాదవ్‌తోపాటు ములాయం సింగ్, ఆయన భార్య సాధనా యాదవ్ కూడా యోగిని కలవనున్నారు. మరికాసేపట్లో యోగి అక్కడకు చేరుకోనున్నారు.