: నేను కపిల్ షోలో వస్తాననడం అబద్ధం: సునీల్ గ్రోవర్


ఆస్ట్రేలియా నుంచి భారత్ వస్తున్న సమయంలో విమానంలో చోటుచేసుకున్న ఘటనను హిందీ బుల్లితెర నటుడు సునీల్ గ్రోవర్ మర్చిపోలేకపోతున్నాడు. సునీల్ గ్రోవర్ మళ్లీ తన షోలో వస్తాడని కపిల్ టీమ్ చెప్పడం పట్ల సునీల్ గ్రోవర్ అసహనం వ్యక్తం చేశాడు. అవన్నీ అబద్ధాలని అన్నాడు. తాను ప్రస్తుతం లైవ్ షోల్లో పని చేస్తున్నానని, మరో టీవీ ఛానెల్ లో కొత్త కామెడీ షో చేయ్యడం లేదని చెప్పాడు. కపిల్ తో వివాదం అనంతరం సోనీ ఛానెల్ లో ప్రసారమవుతున్న కపిల్ షోకు రేటింగ్ పడిపోయినట్టు తెలుస్తోంది. అలాగే యూట్యూబ్ లో ఆ ఛానెల్ కు డిస్ లైక్స్ కూడా పెరిగిపోతున్నట్టు తెలుస్తోంది. దీంతో మద్యం మత్తు కొంపముంచిందని కపిల్ వాపోతున్నాడు. 

  • Loading...

More Telugu News