: కార్యకర్తల పార్టీ టీడీపీ.. కేసీఆర్ ఏమీ చేయలేరు: రేవంత్ రెడ్డి
దివంగత నేత ఎన్టీఆర్ స్ఫూర్తి, అధినేత చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ముందుకు సాగుతుందని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. ఉగాది పండుగ, పార్టీ ఆవిర్భావ దినోత్సవం రెండూ ఒకే రోజున రావడం చాలా సంతోషకరమని చెప్పారు. టీడీపీ కార్యకర్తల పార్టీ అని... ఈ పార్టీని ఎవరూ ఏమీ చేయలేరని అన్నారు. టీడీపీని దెబ్బతీయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్రలు పన్నుతున్నారని... ఆయన ప్రయత్నాలు ఫలించవని చెప్పారు. కొందరు నేతలు పార్టీని వీడినప్పటికీ... కార్యకర్తలు మాత్రం పార్టీకి అండగా ఉన్నారని తెలిపారు.