: 'దేవుని కడప' వెంకటేశ్వరస్వామికి క్యూ కట్టిన ముస్లింలు


కడప జిల్లాలోని 'దేవుని కడప'లో ఉన్న వెంకటేశ్వరస్వామి ఆలయం వద్ద ఉగాది సందర్భంగా ఈ రోజు ముస్లింలు భారీ సంఖ్యలో బారులు తీరారు. హిందూ దేవాలయం వద్ద ముస్లింల క్యూ ఏంటని ఆశ్చర్యపోతున్నారా...? ఇది నిజమే. ఇదేదో కొత్తగా ఏర్పడిన సంప్రదాయం కాదు. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ ఈ ఆచారం కొనసాగుతూనే ఉంటుంది. వెంకటేశ్వరస్వామిని దర్శించుకుని పూజలు చేయడం ఇక్కడి ముస్లింలకు అలవాటు. బీబీ నాంచారమ్మ ముస్లిం మహిళ అని, ఆమెను వివాహమాడిన వెంకటేశ్వరస్వామి తమ అల్లుడని ఇక్కడి వారి విశ్వాసం. దీంతో ఏటా ఉగాది పండుగ రోజు వారు స్వామి వారిని దర్శించుకుని మొక్కులుంటే తీర్చుకుంటుంటారు.

  • Loading...

More Telugu News