: అనుష్క వల్ల బాహుబలి నిర్మాతలకు రూ. 20 కోట్ల నష్టం!


స్వీటీ అనుష్క వల్ల బాహుబలి చిత్ర నిర్మాతలకు ఏకంగా రూ. 20 కోట్ల మేర నష్టం వాటిల్లిందట. వివరాల్లోకి వెళ్తే, బాహుబలి -1 చిత్ర నిర్మాణం సమయంలోనే బాహుబలి-2కు సంబంధించిన చాలా సన్నివేశాలను చిత్రీకరించారు. రెండు సంవత్సరాల క్రితం ఇది జరిగింది. ఆ సమయంలో అనుష్క సన్నగా ఉంది. ఇప్పుడేమో భారీగా బరువు పెరిగిపోయి, బొద్దుగా తయారైంది. దీంతో, అప్పుడు చిత్రీకరించిన సన్నివేశాలకు, ఇప్పుడు తీసిన సన్నివేశాలకు చాలా తేడా వచ్చింది. కొన్ని సీన్లలో సన్నగా... కొన్ని సీన్లలో లావుగా అనుష్క కనపడటంతో... ఆమెకు సంబంధించిన మొత్తం భాగాన్ని రీషూట్ చేయాల్సి వచ్చిందట. దీంతో, నిర్మాతలకు అదనంగా రూ. 20 కోట్లు ఖర్చయిందట.

  • Loading...

More Telugu News