: గుజరాత్ లో ఠారెత్తిస్తున్న ఎండలు
గుజరాత్ లోని అహ్మదాబాద్ నగరం మంగళవారం భగభగలాడిపోయింది. మార్చి నెలలోనే అక్కడ ఉష్ణోగ్రత తారస్థాయికి చేరింది. 42.4 సెల్సియస్ డిగ్రీలు నమోదైంది. ఇది సాధారణం కంటే 5 డిగ్రీలు ఎక్కువ. అమ్రేలిలో 43 డిగ్రీలు నమోదైంది. ఇక రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో 42 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. ఈ ఎండల కారణంగా ఉక్కపోతతో స్థానికులు అవస్థలు పడుతున్నారు. అయితే క్రమంగా ఇవి కొంచెం తగ్గుముఖం పడతాయని వాతావరణ శాఖ పేర్కొనడం కొంచెం ఊరట. ఎండల్లో బయటకు వెళితే వడదెబ్బకు గురికాకుండా రక్షణ చర్యలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. తలపై వస్త్రం కప్పుకోవడం, ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని పేర్కొంటున్నారు.