: బాలీవుడ్ మాజీ నటి మమతా కులకర్ణిపై నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారెంట్
డ్రగ్ రాకెట్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ మాజీ నటి మమతా కులకర్ణిపై థాణే ప్రత్యేక కోర్టు నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అలాగే అంతర్జాతీయ డ్రగ్ స్మగ్లర్ విక్కీ గోస్వామిపైనా వారెంట్ జారీ అయింది. 2014లో షోలాపూర్‌లోని ఎవాన్ లైఫ్ సైన్సెస్ ఫ్యాక్టరీపై దాడి చేసిన థాణే క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అక్కడ పెద్ద ఎత్తున డ్రగ్స్ తయారు చేస్తున్నట్టు గుర్తించారు. దీని వెనక మమతా కులకర్ణి, విక్కీ గోస్వామి ఉన్నట్టు నిర్ధారించారు. ఈ విషయం బయటపడినప్పటి నుంచి మమతా కులకర్ణి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అమెను అదుపులోకి తీసుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో కోర్టు నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.