: అందుకే, ఆ సినిమాను ఫ్యాన్స్ కూడా చూడట్లేదట!: రామ్ గోపాల్ వర్మ కవ్వింపు


ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులకు మధ్య ట్వీట్ల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వర్మ తాజాగా మరో ట్వీట్ చేశారు. అయితే, ఫలానా సినిమా అని ప్రస్తావించకుండా ఈ ట్వీట్ చేశారు. ‘ఆ సినిమాను ఫ్యాన్స్ కూడా చూడకపోవడానికి గల కారణాన్ని అతని అభిమాన సంఘం అధ్యక్షుడు ఇప్పుడే చెప్పారు. ఎందుకంటే, బీబీ2 (బాహుబలి 2) చిత్రాన్ని చాలా సార్లు చూసేందుకని వాళ్లు డబ్బులు దాచుకుంటున్నారని ఆ ఫ్యాన్స్ అధ్యక్షుడు చెప్పారు’ అని ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. అయితే, ఏ హీరో సినిమా ఇటీవల విడుదలైందో అందరికీ తెలిసిన విషయమే. ఆ హీరో పేరు ప్రస్తావించకుండా ఆ ఫ్యాన్స్ ని వర్మ తన దైనశైలిలో మరోమారు కవ్వించారు.

  • Loading...

More Telugu News