: బీజేఎల్పీ ఆఫీసు గది జగన్ బాత్రూమ్ అంత కూడా లేదు: ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు
ఏపీ అసెంబ్లీని నిర్మించిన తీరుపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు విమర్శల వర్షం కురిపించారు. స్కూల్స్, కాలేజీలు నిర్మించినట్టుగా అమరావతిలో అసెంబ్లీ భవనాన్ని నిర్మించారని అన్నారు. బీజేఎల్పీ ఆఫీసును అష్టవంకర్లతో నిర్మించారని, ఆ గదిని చూస్తే తనది చేతగాని తనమనే భావన ఢిల్లీ పెద్దలకు కలిగేలా ఉందని విమర్శించారు. ఢిల్లీ నుంచి బీజేపీ నేతలు ఎప్పుడైనా ఇక్కడికి వస్తే ఈ గదికి తీసుకురావాలన్నా ఇబ్బందేనని అన్నారు. బీజేఎల్పీ గదిలో బాత్రూమ్ లేదేమిటని మంత్రులను ప్రశ్నిస్తే, ‘మాదీ అదే పరిస్థితి’ అని అంటున్నారని, ప్రతిపక్ష నేత జగన్ బాత్రూమ్ అంత కూడా తమ ఆఫీసు గది లేదంటూ విష్ణుకుమార్ రాజు పేర్కొనడం గమనార్హం.