: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న 'హాయ్ వోబో...ఐ లవ్యూ వోబో' వీడియో... మీరూ చూడండి
రోబోలంటే అమితంగా ఇష్టపడే ఓ చిన్నారి... పాడైపోయిన వాటర్ హీటర్ ను రోబోగా పొరపడి దానితో మాట్లాడిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అమెరికాలో ఓ తల్లి తన చిన్నారి కుమార్తె రెయినాతో కలిసి రోడ్డుపై నడుస్తుండగా రోడ్డు మీద పాడుబడ్డ పెద్ద సైజు వాటర్ హీటర్ కనిపించింది. ఇది చూసేందుకు రోబోలా అనిపించడంతో తల్లిని వదిలేసి ముందుకు వెళ్లిన ఆ పాపాయి... 'హాయ్ వోబో' అని వచ్చీరాని మాటలతో పలకరించింది. అనంతరం ఐ లవ్యూ వోబో అంటూ దానిని కౌగిలించుకుంది. ఈ తతంగాన్నంతా ఆ తల్లి ఫోన్ లో చిత్రీకరించి, తన చిట్టితల్లికి రోబో అంటే చాలా ఇష్టమని చెబుతూ, దానిని సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఇది వైరల్ గా మారింది. ఆ వీడియోను మీరు కూడా చూడండి.