: టీమిండియాకు ప్రపంచంలో ఎక్కడైనా గెలిచే సత్తా ఉంది: కుమార సంగక్కర
టీమిండియాకు ప్రపంచంలో ఎక్కడైనా గెలిచే సత్తా ఉందని శ్రీలంక దిగ్గజ మాజీ కెప్టెన్ కుమార సంగక్కర అన్నాడు. క్రికెట్ నుంచి తప్పుకున్న అనంతరం వివిధ బిజినెస్ లలో పడిపోయిన సంగక్కర.... టీమిండియా సిరీస్ గెలవడంపై ట్విట్టర్ ద్వారా స్పందించాడు. పేస్, స్పిన్ కు అనుకూలించే పిచ్ లపై అద్భుతమైన విజయాలు సాధించిన టీమిండియాకు ప్రపంచంలో ఎక్కడైనా గెలిచే సత్తా ఉందని అన్నాడు. బీసీసీఐకి శుభాకాంక్షలని చెప్పాడు. సిరీస్ లో టీమిండియా ఆటగాళ్లంతా సమష్టిగా అద్భుతంగా రాణించారని సంగక్కర చెప్పాడు.