: ‘పూర్ణ’ సినిమాపై రాష్ట్రపతి ప్రణబ్ ప్రశంసలు!


పదమూడేళ్ల వయసులోనే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి రికార్డు సృష్టించిన తెలంగాణ బాలిక పూర్ణ మాలావత్ గుర్తుండే ఉంటుంది. ఆమె జీవిత చరిత్రను స్ఫూర్తిగా తీసుకుని ‘పూర్ణ’ అనే చిత్రాన్ని దర్శకుడు రాహుల్ బోస్ రూపొందించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కోసం ఓ స్పెషల్ ప్రివ్యూ షోను ఏర్పాటు చేశారు. ఈ నెల 25న రాష్ట్రపతి భవన్ లో ఏర్పాటు చేసిన ఈ  షో ను ప్రణబ్ తిలకించారు. ఈ సందర్భంగా ‘పూర్ణ’ చిత్రంపై ఆయన ప్రశంసలు కురిపించారు. పూర్ణ మాలావత్ ను, చిత్ర యూనిట్ సభ్యులను ఆయన అభినందించారు. జీవితంలో ఏదైనా సాధించాలనుకునే మహిళా లోకానికి ఈ సినిమా స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని అన్నారు. కాగా, త్వరలో విడుదల కానున్న ఈ చిత్రంలో పూర్ణ మాలావత్ పాత్రను అదితి ఇనామ్ దార్ అనే కొత్త ఆర్టిస్ట్ పోషించింది.

  • Loading...

More Telugu News