: వైఎస్ జగన్‌కు షాక్... జగన్ బెయిల్ ను రద్దు చేయాలని సీబీఐ పిటిషన్
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఈ రోజు భారీ షాక్ తగిలింది. అక్రమాస్తుల కేసులో జగన్ బెయిల్ ను రద్దు చేయాలని సీబీఐ కోర్టులో సీబీఐ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. కేసును ప్రభావితం చేసేలా జగన్ ప్రవర్తిస్తున్నారని అందులో పేర్కొన్నారు. కేసులో సాక్షులుగా ఉన్న వారితో మాట్లాడుతున్నారని, వారిని ప్రలోభపెడుతున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. సీబీఐ పిటిషన్‌పై విచారణ వచ్చేనెల 7కి వాయిదా పడింది. అప్పటిలోగా ఈ అభియోగాలపై కౌంటర్ దాఖలు చేయాలని జగన్ ను కోర్టు ఆదేశించింది. కేసులో సాక్షిగా ఉన్న మాజీ సీఎస్ రమాకాంతరెడ్డి ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలోని పలు అంశాలను సీబీఐ అధికారులు కోర్టుకు వివరించారు.