: నా భర్త అలా చేస్తాడనుకోలేదు: లండన్ ఉగ్రవాది భార్య
తన భర్త దాడికి దిగాడని తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యానని, ఆయన అలా చేస్తారని ఊహించలేదని బ్రిటన్ పార్లమెంటు సమీపంలో దాడికి తెగబడి హతమైన ఉగ్రవాది ఖలీద్ మసూద్ భార్య రోహే హైదర్ తెలిపింది. మెట్రోపాలిటన్ పోలీసుల ద్వారా యూకే ప్రెస్ అసోసియేషన్ కు పత్రికా ప్రకటన విడుదల చేసిన ఆమె, అందులో బాధిత కుటుంబాలు తమను క్షమించాలని వేడుకున్నారు. దాడిని ఖండిస్తున్నానని తెలిపిన ఆమె, దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సంతాపం తెలుపుతున్నానని, క్షతగాత్రులు తొందరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానని ఆమె అన్నారు. తమ పిల్లల కోసం తమను ప్రశాంతంగా వదిలేయాలని ఆమె విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.