: కూతుళ్లతో కలిసి ఎంజాయ్ చేస్తున్న సుస్మితా సేన్
మాజీ విశ్వసుందరి, బాలీవుడ్ హీరోయిన్ సుస్మితా సేన్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. రెనీ (12), అలీసా (7) అనే ఇద్దరు పిల్లలను పెంచుకుంటున్న సుస్మితా సేన్...సినిమాల్లో కూడా అడపాదడపా కనిపిస్తోంది. రియాలిటీ షోస్ లో కనిపించిన సుస్మిత...ఫెమినిజం, స్త్రీ స్వాతంత్ర్యం వంటి అంశాలపై అప్పుడప్పుడు సెమినార్లలో పాల్గొంటుంది. ఈ మధ్య ఎక్కిడికెళ్లిందో కానీ పెద్ద కుమార్తెను తీసుకుని బీచ్ లో వాహ్యాళికి వెళ్లిన సుస్మిత, చిన్న కుమార్తెతో డాన్స్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో పెట్టింది. సుదీర్ఘ కాలం తరువాత బికినీతో సుస్మిత కనిపించడంతో అభిమానుల నుంచి ఆ వీడియోకి విశేషమైన ఆదరణ లభిస్తోంది. ఆ వీడియో మీరు కూడా చూడండి.