: ప్రేమలో ఉన్నానని ఒప్పుకున్న హీరోయిన్ తాప్సి


హీరోయిన్ తాప్సి ప్రేమలో పడిందనే వార్తలు గత కొంత కాలంగా వినిపిస్తూ ఉన్నాయి. అయితే, ఈ విషయాన్ని తాప్సి ఎన్నడూ ఒప్పుకోలేదు. కానీ, ఇప్పుడు తాను ప్రేమలో ఉన్నాననే విషయాన్ని ఈ అమ్మడు బయటపెట్టింది. అయితే, ఎవరితో ప్రేమలో పడిందనే విషయాన్ని మాత్రం ఆమె చెప్పలేదు. వ్యక్తిగత విషయాలను మీడియాతో పంచుకోవడం తనకు ఇష్టం లేదని... అందుకే పర్సనల్ లైఫ్ గురించి చెప్పడం లేదని తెలిపింది. తమ ప్రేమ పట్ల, తాను ప్రేమిస్తున్న వ్యక్తి పట్ల చాలా గర్వంగా ఉన్నానని చెప్పింది. ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ వివరాలను వెల్లడించింది.

కాగా, డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్, ఒలింపిక్స్ సిల్వర్ పతక విజేత మాగియాస్ బోయ్ తో తాప్సి ప్రేమలో ఉన్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News