: కెప్టెన్ గా అరుదైన రికార్డు సాధించిన రహానే
ధర్మశాలలో ఆస్ట్రేలియాతో జరిగిన చివరిటెస్టు మ్యాచులో టీమిండియా ఆటగాడు అజింక్యా రహానే కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచులో టీమిండియా గెలవడంతో ఆయన అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించిన తొలి మ్యాచ్‌లోనే విజయాన్ని సాధించిన రికార్డును ఇంతవరకు మహేంద్ర సింగ్ ధోని, పాలీ ఉమ్రిగర్, సునీల్ గవాస్కర్, రవిశాస్త్రి, సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్, అనిల్ కుంబ్లే అందుకున్నారు. ఈ ఆటగాళ్ల సరసన తాజాగా రహానే కూడా చేరాడు. ఇటీవల గాయపడిన విరాట్ కోహ్లీ ఆ గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో చివరి టెస్టు మ్యాచులో రహానే కెప్టెన్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే.