: పోలీసు వాహనం డ్రైవర్ సీటులో చంద్రబాబు
అమరావతిలో రోడ్ సేఫ్టీ వాహనాలను ప్రారంభించిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఓ వాహనం ఎక్కి డ్రైవర్ సీటులో కూర్చుని దానిలోని సౌకర్యాలు, అధునాతన సాంకేతిక వ్యవస్థల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ప్రమాదాల నిర్వహణకు ప్రతి మంగళవారం సమీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో ముఖ్యమైన 16వ నంబర్ జాతీయ రహదారిపై రక్షణ చర్యలు చేపట్టామని, ప్రతి యేటా దేశంలో 5 లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటే, వీటిల్లో లక్షన్నర మంది వరకూ మరణిస్తున్నారని, మద్యం తాగి వాహనాలు నడపడం, అతివేగం అత్యధిక ప్రమాదాలకు కారణమని చెప్పారు. వేలాది మందిని వికలాంగులుగా మారుస్తున్న రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట వేసి తీరుతామని అన్నారు. రహదారులపై ప్రమాదకరమైన మలుపులు లేకుండా చేయాలన్న లక్ష్యంతో పని చేస్తున్నామని తెలిపారు.