: జనసైనికులూ తరలిరండి: తొలిసారిగా పవన్ నుంచి ఆహ్వానం


తమ పార్టీలో కార్యకర్తలుగా చేరాలని పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ నుంచి తొలిసారిగా అధికారిక ఆహ్వానం వెలువడింది. అనంతపురం జిల్లా జనసైనికులకు ఆహ్వానం పలుకుతున్నామని ఆ పార్టీ పేర్కొంది. స్థానిక, రాష్ట్ర సమస్యలపై అవగాహన ఉన్నవారిని పార్టీలోకి పవన్ ఆహ్వానిస్తున్నట్టు జనసేన కార్యాలయం ప్రకటించింది. స్పీకర్స్, రైటర్స్ తో పాటు విశ్లేషకులుగా పనిచేసేందుకు ఆసక్తి ఉన్నవారు రావాలని, ఎంపిక ప్రక్రియ త్వరలో ప్రారంభమవుతుందని పేర్కొంది. ఏప్రిల్ 4 లోపు దరఖాస్తులు చేసుకోవాలని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఈ ప్రకటనలో స్వయంగా కోరారు. ప్రస్తుతానికి అనంతపురం జిల్లాకు మాత్రమే నియామకాలు పరిమితమని, త్వరలో ఏపీలోని మిగతా జిల్లాలకూ దరఖాస్తులను ఆహ్వానిస్తామని ఈ సందర్భంగా పవన్ ప్రకటించారు.

  • Loading...

More Telugu News