: కవిత ఇప్పటికీ పుట్టింటి పేరునే చెప్పుకుంటున్నారు..!: పొన్నం ప్రభాకర్ ఎద్దేవా


టీఆర్ఎస్ ఎంపీ కవితపై కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శలు గుప్పించారు. పెద్దపల్లి-నిజామాబాద్ రైల్వే లైను గురించి పార్లమెంటులో కవిత ఏనాడూ మాట్లాడలేదని ఆయన విమర్శించారు. ఆమె మాట్లాడినట్టు నిరూపిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు. ఎన్నికల సమయంలో రైల్వే లైను గురించి హామీ ఇచ్చానని, ఇప్పుడు ఆ హామీని నెరవేర్చానని కవిత చెప్పుకోవడం హాస్యాస్పదమని విమర్శించారు. 1993లోనే రైల్వే లైన్ నిర్మాణం కోసం దివంగత ప్రధాని పీవీ శంకుస్థాపన చేశారని తెలిపారు. తాను, మధుయాష్కీ ఎంపీలుగా ఉన్న సమయంలోనే రైల్వే లైనును పెద్దపల్లి వరకు పొడిగించడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని చెప్పారు.

హిందూ సంప్రదాయం ప్రకారం భర్త ఇంటి పేరును భార్య పెట్టుకుంటుందని... కానీ, కవిత మాత్రం ఇప్పటికీ 'కల్వకుంట్ల కవిత' అంటూ పుట్టింటి పేరునే చెప్పుకుంటున్నారని పొన్నం ఎద్దేవా చేశారు. కవిత నిజామాబాద్ ఎంపీ అని... బతుకమ్మకు బ్రాండ్ అంబాసడర్ కాదని విమర్శించారు. విదేశాలలో బతుకమ్మలు ఆడటం మానేసి, నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు. 

  • Loading...

More Telugu News