: లోకేశ్ ఎమ్మెల్సీపై పయ్యావుల ఆసక్తికర వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆవరణలోని టీడీపీ శాసనసభాపక్ష కార్యాలయంలో సోమవారం ఆసక్తికర చర్చ జరిగింది. కార్యాలయంలో సీనియర్ నేతలు కరణం బలరాం, పయ్యావుల కేశవ్ తదితరులు ఉన్నప్పుడు శాసనమండలిపై చర్చ వచ్చింది. శాసనమండలి అంటే సీనియర్ నేతలు, తలపండిన నాయకులు మాత్రమే ఉండే సభ అనే అభిప్రాయం ఉంది. దీనిని పెద్దల సభ అని కూడా వ్యవహరిస్తుంటారు. అయితే ఇటీవల లోకేశ్‌తోపాటు కరణం బలరాం కూడా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. వీరిద్దరూ శాసనమండలిలో త్వరలో అడుగుపెట్టనున్నారు. లోకేశ్ రాజకీయ ప్రస్థానం ఎమ్మెల్సీగా 2017లో మొదలవుతోంది. కరణం బలరాం 1978లో తొలిసారి శాసనసభకు ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ శాసనసభలో 1978 బ్యాచ్ మొదలుకుని 2017 బ్యాచ్ నాయకుల వరకు సభ్యులుగా ఉన్నారని వ్యాఖ్యానించడంతో ఒక్కసారిగా నవ్వులు పూశాయి.