: నేడు స్వామి వారి బొక్కసానికి భారీ ఆదాయం: టీటీడీ
నేడు తిరుమల శ్రీ వెకటేశ్వరస్వామి బొక్కసానికి భారీగా ఆదాయం సమకూరిందని తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. నేడు సమకూరిన ఆదాయంపై ప్రకటన చేసింది. నేడు శ్రీవారి హుండీ ఆదాయం 5 కోట్ల రూపాయలని టీటీడీ ప్రకటించింది. పెద్దనోట్ల రద్దు చేసిన 8 నవంబర్ 2016 తరువాత ఇంత భారీ మొత్తంలో ఆదాయం ఇంతవరకు ఎప్పుడూ సమకూరలేదని టీటీడీ తెలిపింది. నోట్ల రద్దు అనంతరం తొలిసారి 5 కోట్ల రూపాయల ఆదాయం దేవస్థానం హుండీకి వచ్చిందని వారు వెల్లడించారు.