: ‘అగ్రిగోల్డ్’ చైర్మన్ వెంకట రామారావుకు అస్వస్థత.. హైదరాబాద్ కు తరలింపు!


‘అగ్రిగోల్డ్’ చైర్మన్ అవ్వా వెంకట రామారావుకు మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. గుండె జబ్బుల విభాగంలో వెంకట రామారావుకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. కాగా, వెంకట రామారావుతో పాటు ‘అగ్రిగోల్డ్’ ఎండీ శేష నారాయణ ఈ రోజు ఉదయం అస్వస్థతకు గురవడంతో మొదట ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తర్వాత మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడలోని ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే, రామారావు కు మరింత మెరుగైన చికిత్స నిమిత్తం నిమ్స్ కు తరలించాల్సి వచ్చింది. కాగా, ‘అగ్రిగోల్డ్’లో డిపాజిట్లు చేసుకున్న వేలాది మంది మోసపోయిన కేసులో వెంకట రామారావు, శేష నారాయణలను ఈ మధ్య అరెస్టు చేసి ఏలూరు సబ్ జైలుకు పంపారు.

  • Loading...

More Telugu News