: ‘నారాయణ’ విద్యార్థి ఆత్మహత్యాయత్నం
నారాయణ విద్యా సంస్థలో మరో విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తిరుపతి నారాయణ స్కూల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థి వాసు మొదటి అంతస్తు పై నుంచి దూకడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే, పాఠశాల సిబ్బంది అతన్ని ఆసుపత్రికి తరలించారు. సిబ్బంది వేధింపులే తమ కొడుకు ఆత్మహత్యాయత్నానికి కారణమని ఆరోపించారు. కాగా, పది రోజుల క్రితమే పదో తరగతి విద్యార్థి సాయిచరణ్ ఆత్మహత్య చేసుకున్నాడు.