: మరో అరుదైన ఘనత సాధించిన విలియమ్సన్


హామిల్టన్ వేదికగా సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌ల మ‌ధ్య మూడో టెస్టు మ్యాచు జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ఈ మ్యాచ్ ద్వారా న్యూజిలాండ్‌ ఆటగాడు కేన్‌ విలియమ్సన్ 5 వేల ప‌రుగులు పూర్తిచేసుకున్నాడు. గతంలో న్యూజిలాండ్‌ ఆటగాడు మార్టిన్‌ క్రో 117 ఇన్నింగ్స్‌ల ద్వారా 5 వేల పరుగులు సాధించగా, విలియమ్సన్ మాత్రం ఈ ఘ‌న‌త‌ను 110 ఇన్నింగ్స్‌ల్లోనే సాధించి ఆ దేశం తరఫున వేగవంతంగా 5 వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా అరుదైన ఘ‌న‌త‌ను అందుకున్నాడు. ఈ మ్యాచ్ లో మొదట
బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 314 పరుగులు చేసింది. విలియమ్సన్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్ ఆడి, సెంచరీ సాధించడంతో న్యూజిలాండ్‌ జట్టు ఆధిక్యంలోకి వెళ్లింది. విలియమ్సన్‌ టెస్టుల్లో 17వ సెంచ‌రీని చేశాడు. ఈ రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ స్కోరు 321/4  గా ఉంది.

  • Loading...

More Telugu News