: ప్రాక్టీస్ చేస్తున్నా.. ఆసియా ఛాంపియన్ షిప్ లో పతకమే నా లక్ష్యం: మేరీకోమ్
తాను ఇంకా బాక్సింగ్ సాధన చేస్తూనే ఉన్నానని... ఆసియా ఛాంపియన్ షిప్ లో పతకం సాధించడమే తన లక్ష్యమని ఒలింపిక్స్ పతక విజేత మేరీకోమ్ తెలిపింది. ఇప్పట్లో రిటైర్మెంట్ యోచన తనకు లేదని చెప్పింది. గత ఏడాది జరిగిన ప్రపంచ కప్ లో ఓటమిపాలైన తర్వాత ఆమె మళ్లీ బాక్సింగ్ రింగ్ లోకి అడుగుపెట్టలేదు. ఆసియన్ ఛాంపియన్ షిప్ లో అత్యుత్తమంగా ఆడి పతకం సాధించడమే తన టార్గెట్ అని తెలిపింది. ఆస్ట్రేలియాలో జరిగిన ప్రత్యేక ఒలింపిక్స్ లో భారత బృందం 37 స్వర్ణ, 10 రజత, 26 కాంస్య పతకాలను సాధించింది. ఈ నేపథ్యంలో, ప్రభుత్వం వీరికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి హాజరైన మేరీకోమ్ మాట్లాడుతూ ఈ వివరాలను వెల్లడించింది. అయితే, ప్రొఫెషనల్ బాక్సింగ్ వైపు వెళ్లే ఆలోచన తనకు లేదని చెప్పింది. ఇటీవలే బాక్సింగ్ జాతీయ పరిశీలకురాలిగా మేరీకోమ్ నియమితురాలైన సంగతి తెలిసిందే.