: తెలంగాణ‌ శాసనసభలో స్పీకర్‌ చైర్‌లో ఎమ్మెల్యే సురేఖ.. ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ


తెలంగాణ శాస‌న‌స‌భ స‌మావేశాలు కొన‌సాగుతున్నాయి. సభ ప్రారంభమైనప్పుడు స్పీకర్‌గా మధుసూదనాచారి ఉన్నారు. అయితే, కొద్దిసేప‌టి క్రితం ఆయ‌న సభ నుంచి వెళ్లిపోయారు. మ‌రోవైపు శాస‌న‌స‌భ ఉప స‌భాప‌తి పద్మా దేవేందర్‌రెడ్డి కూడా సభలో లేకపోవడంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొండా సురేఖ ప్యానల్ స్పీకర్‌గా వ్యవహరిస్తున్నారు. స‌భ‌లో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ జరుగుతోంది. ఈ బిల్లుపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడిన అనంత‌రం ప్ర‌స్తుతం ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌సంగిస్తున్నారు.

  • Loading...

More Telugu News