: భారీగా పెరగనున్న సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిల జీతాలు


సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిల వేతనాలు భారీగా పెరగనున్నాయి. 200 శాతం వరకు ఈ వేతనాలు పెరగబోతున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలకు సంబంధించి 7వ వేతన సంఘం సిఫారసుల నేపథ్యంలో, తమకు కూడా వేతనాలను పెంచాలంటూ న్యాయమూర్తులు కోరారు. ఈ నేపథ్యంలో, ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన కమిటీని కేంద్రం నియమించింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వేతనాన్ని రూ. 3 లక్షలకు పెంచాలంటూ కమిటీ సిఫారసు చేసింది. కమిటీ సిఫారసులకు సానుకూలంగా స్పందించిన కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రూ. 2.80 లక్షలు, హైకోర్టు చీఫ్ జస్టిస్ కు రూ. 2.50 లక్షలు, ఇతర న్యాయమూర్తులకు రూ. 2.25 లక్షలు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ వేతనాల పెంపుకు సంబంధించిన సవరణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందాల్సి ఉంది. దీంతో, న్యాయశాఖ మంత్రి ఆ దిశగా చర్యలు చేపట్టారు.    

  • Loading...

More Telugu News