: పవన్ కల్యాణ్ వేస్ట్.. చిరంజీవే బెస్ట్: రోజా


జనసేన పార్టీని స్థాపించి ఇంతకాలం అయినా ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సాధించిందేమిటని వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శించారు. మోదీ, చంద్రబాబులకు జై కొడుతూ, ఏదైనా తప్పు జరిగితే తాను ప్రశ్నిస్తానంటూ చెప్పిన పవన్... సైలెంట్ గా కూర్చున్నారని అన్నారు. పార్టీ స్థాపించినప్పటికీ... ఇప్పటి వరకు ఒక ఎన్నికలో కూడా పోటీ చేయలేదని విమర్శించారు. పవన్ కల్యాణ్ కన్నా ఆయన సోదరుడు చిరంజీవే మేలని... ప్రజారాజ్యం పార్టీని స్థాపించి, ఎన్నికల్లో పోటీ చేసి, కొన్ని స్థానాల్లో అయినా గెలుపొందారని అన్నారు. పవన్ కల్యాణ్ రాజకీయాలకు కొత్త కాదని... పార్టీ స్థాపించి ఇంతకాలమైనా ఏమీ సాధించలేని పవన్... రానున్న ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపలేరని తెలిపారు. ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పైవిధంగా స్పందించారు.

  • Loading...

More Telugu News