: బహుబలి భారతీయ సినీ పరిశ్రమ మీద ఎంతో ప్రభావం చూపింది!: సుబ్బరాజు


ఇంతవరకు తెలుగు సినిమాలు, హిందీ సినిమాలు, తమిళ, మలయాళ, కన్నడ సినిమాలు అంటూ ఉండేవని నటుడు సుబ్బరాజు తెలిపాడు. బాహుబలి- ది కన్ క్లూజన్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఆయన మాట్లాడుతూ, బాహుబలి సినిమా ఎన్ ఇండియన్ ఫిల్మ్ గా పేరొందిందని అన్నారు. బహుబలి భారతీయ సినీ పరిశ్రమ మీద ఎంతో ప్రభావం చూపిందని చెప్పాడు. ఇలాంటి సినిమాలో నటించే అవకాశం అతి కొద్ది మందికి మాత్రమే దక్కుతుందని చెప్పాడు. తనను ఈ సినిమాలో భాగం చేసిన రాజమౌళికి ధన్యవాదాలు తెలిపాడు. తన నటనను మెరుగుపరుచుకునేందుకు సాయం చేసిన ప్రభాస్, రానా తదితరులందరికీ ధన్యవాదాలు తెలిపాడు.  

  • Loading...

More Telugu News