: బాహుబలి 2 ఇంకా పూర్తికాలేదు... నేను టెన్షన్ లోనే ఉన్నాను: రాజమౌళి


'బాహుబలి- ది కన్ క్లూజన్' సినిమా ఇంకా పూర్తికాలేదని ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెలిపాడు. హైదరాబాదులోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక సందర్భంగా మాట్లాడుతూ, ఈ సినిమాకు నిజమైన హీరో తాను కాదని అన్నాడు. నిజమైన 'బాహుబలి' ప్రభాస్ అని చెప్పాడు. 'బాహుబలి 2'లో షూటింగ్ పార్ట్ మాత్రమే పూర్తయిందని రాజమౌళి అన్నాడు. విజువల్ ఎఫెక్ట్స్ తమ చేతికి పూర్తిగా వస్తే కానీ సినిమా పూర్తయినట్టుగా తాను భావించనని చెప్పాడు. అయితే షూటింగ్ పార్ట్ పూర్తికావడంతో ఒక రకమైన టెన్షన్ పోయిందని చెప్పాడు. తన టీమ్ అద్భుతంగా పని చేసిందని, 'బాహుబలి' సినిమా అద్భుతంగా వచ్చిందంటే దానికి కారణం ఈ సినిమాకు పని చేసిన టెక్నీషియన్లని రాజమౌళి చెప్పాడు. 

  • Loading...

More Telugu News