: చికెన్ ముక్కలు పక్కన పెట్టేసి.. బిర్యానీ తింటా!: లావణ్య త్రిపాఠి


దక్షిణాది వంటకాలు తనకు చాలా ఇష్టమని టాలీవుడ్ 'అందాల రాక్షసి' లావణ్య త్రిపాఠి తెలిపింది. తన ఇష్టాయిష్టాల గురించి మాట్లాడుతూ, తనకు ఫోన్ లో ఎక్కువ సేపు గడపడం పెద్దగా ఇష్టం ఉండదని తెలిపింది. వ్యక్తిగత విషయాలు అభిమానులతో ముచ్చటించడం ఇష్టం ఉండదని చెప్పింది. డెహ్రాడూన్ నుంచి ముంబై వచ్చిన తాను మోడలింగ్ చేస్తూనే ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు పూర్తి చేశానని తెలిపింది.

మన చుట్టూ నవ్వుతున్నవారుంటే వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుందని లావణ్య పేర్కొంది. హైదరాబాదులో త్వరలో ఇల్లు కొనుక్కుంటానని చెప్పింది. బయటి భోజనం చేయలేకపోతున్నానని తెలిపింది. తనకు వంట వచ్చని వెల్లడించింది. బయటకు వెళ్లినప్పుడు బిర్యానీ తింటానని తెలిపింది. బిర్యానీ తనకు ఇష్టమని, అయితే తాను మాంసాహారం తిననని, అందుకే బిర్యానీలోని చికెన్ పీసులను పక్కకు తీసేసి, మిగతా బిర్యానీ తింటానని తెలిపింది. ప్రస్తుతం తాను 'మిస్టర్', 'రాథ' సినిమాల్లో నటిస్తున్నానని చెప్పింది. 

  • Loading...

More Telugu News