: తమిళ రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకం.. ప్రకాశ్‌రాజ్ సంచలన వ్యాఖ్యలు


ఓ ప్రైవేటు టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నటుడు ప్రకాశ్‌రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. జయలలిత మృతి తర్వాత తమిళనాడు రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని వ్యాఖ్యానించాడు. జయ మరణం తర్వాత అందరికీ మాట్లాడే ధైర్యం వచ్చిందన్నాడు. జయ తర్వాత రాష్ట్రంలో బాధ్యతాయుతమైన నాయకుడే కనిపించలేదని, తమిళ ప్రభుత్వ భవిష్యత్, పాలన ప్రశ్నార్థకంగా ఉందని పేర్కొన్నాడు. ఎవరో ఒక నాయకుడిని అనూహ్యంగా ఎన్నుకోవడాన్ని తప్పుబట్టిన ప్రకాశ్‌రాజ్ ప్రజలు వారి కోసం ఓట్లు వేయలేదన్న సంగతిని గుర్తు పెట్టుకోవాలన్నాడు.

రాజ్యాంగం ప్రకారం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఐదేళ్లు పరిపాలించాల్సిందేనని తేల్చి చెప్పాడు. ప్రభుత్వం ఏదైనా నిర్మాతల మండలి కోసం వారితో కలిసి మాట్లాడతామని స్పష్టం చేశాడు. జల్లికట్టు కోసం యువత కలిసికట్టుగా పోరాడిందని, వారికి తాము మద్దతు తెలిపామన్నాడు. అయితే ఈ విషయంలో పోలీసులు అనవసరంగా హింసాత్మక చర్యలకు పాల్పడ్డారని ప్రకాశ్‌రాజ్ ఆవేదన వ్యక్తం చేశాడు.

  • Loading...

More Telugu News