: పొరపాటున తప్పుగా మాట్లాడా: 'అడవి పందుల మాంసం' వివాదంపై భూపాలపల్లి కలెక్టర్
అడవి పందులను చంపి తినాలని చెప్పి విమర్శలు ఎదుర్కొన్న భూపాలపల్లి కలెక్టర్ ఆకునూరి మురళి, తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకున్నారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేస్తూ, పోషకాహారం గురించి మాట్లాడుతూ, ప్రజలు రోగాల బారిన పడకుండా ఉండేందుకు అడవి పందుల మాంసం తినాలని పొరపాటున చెప్పానని అన్నారు. వన్యప్రాణుల సంరక్షణ చట్టాలను అనుసరించి, వీటిని చంపడం, తినడం నేరమని, అందుకు శిక్షలు ఉన్నాయని అన్నారు.
ప్రభుత్వం గుర్తించిన, శిక్షణ పొందిన షూటర్లు మాత్రమే, ముందస్తు అనుమతితో అడవి పందులను చంపవచ్చని, ప్రజలకు వేటాడేందుకు అనుమతి లేదని అన్నారు. తన మాటల్లో పొరపాటు దొర్లిందని తెలిపారు. కాగా, రెండు రోజుల క్రితం ఏటూరునాగారంలో నిర్వహించిన ప్రపంచ టీబీ దినోత్సవంలో ఆయన మాట్లాడుతూ, ప్రజలు అడవి పందులను చంపి తినాలని చెప్పిన సంగతి తెలిసిందే.