: అరుణ్ జైట్లీ పరువు నష్టం కేసులో... సీఎం కేజ్రీవాల్‌కు నోటీసులు జారీ చేసిన కోర్టు


కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీపై ఢిల్లీ ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్ ప‌లు ఆరోప‌ణ‌లు చేసిన విష‌యం తెలిసిందే. గతంలో డీడీసీఏ స్కాంలో జైట్లీకి భాగం ఉందంటూ ఆయ‌న తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. అయితే, త‌నపై తీవ్ర ఆరోప‌ణ‌లు చేసిన కేజ్రీవాల్ సహా కుమార్ విశ్వాస్, ఆశుతోష్, సంజయ్ సింగ్, రాఘవ్ చద్ధా, దీపక్ బాజ్‌పేయిలపై అరుణ్ జైట్లీ పరువునష్టం దావా వేయ‌డంతో ఈ కేసులో విచార‌ణ జ‌రుపుతున్న ఢిల్లీలోని ప‌టియాలా హౌస్‌ కోర్టు వారి ఐదుగురికి నోటీసులు పంపింది. ఈ కేసులో తదుపరి విచారణను మే 20కి వాయిదా వేస్తున్న‌ట్లు పేర్కొంది. కాగా, జైట్లీపై ఆరోపణలు చేసిన ఆ ఐదుగురు నేత‌లు బహిరంగ క్షమాపణ చెప్పాల‌ని భార‌తీయ జ‌న‌తా పార్టీ సూచించినప్ప‌టికీ వారు పట్టించుకోలేదు.

  • Loading...

More Telugu News