: పదేళ్ల కిందటే మా అబ్బాయిని పాలిటిక్స్ లోకి తీసుకురావాలనుకున్నాను: హీరో విజయ్ తండ్రి


త‌మిళ‌నాడులో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సినీన‌టులు ర‌జ‌నీకాంత్‌, విజ‌య్‌ల పేర్లు వినిపిస్తూ ఉంటాయి. వీరు రాజకీయాల్లోకి రావచ్చంటూ ప్రతిసారీ వీరి పేర్లు వినిపిస్తుంటాయి. అయితే, హీరో విజ‌య్ రాజ‌కీయ ప్ర‌వేశంపై ఆయ‌న తండ్రి చంద్రశేఖరన్ తాజాగా స్పందిస్తూ ప‌లు విష‌యాలు తెలిపారు. పదేళ్ల కిందటే త‌న కుమారుడు విజయ్‌ను రాజ‌కీయాల్లోకి తీసుకురావాలని తాను అనుకున్నానని, అయితే, ఇప్పుడు త‌న అభిప్రాయాన్ని మార్చుకున్నాన‌ని చెప్పారు. ప్ర‌స్తుతం రాజకీయాలు పూర్తిగా వ్యాపారమయం అయ్యాయని, ఇప్పుడు త‌న కుమారుడు రాజ‌కీయాల్లోకి రాకూడ‌ద‌ని తాను కోరుకుంటున్నాన‌ని తేల్చి చెప్పారు.

  • Loading...

More Telugu News