: కేసీఆర్! ఊరూర తిరిగి నీ బండారం బయటపెడతా!: వీహెచ్
తెలంగాణలో ప్రజాస్వామ్య వ్యవస్థ నాశనం అయిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీహెచ్ మండిపడ్డారు. ఇందిరాపార్క్ వద్ద ఉన్న ధర్నా చౌక్ ను సిటీ బయటకు రాచకొండకు తరలిస్తామని ప్రభుత్వం చెబుతుండటాన్ని ఆయన తప్పుబట్టారు. వేరే వాళ్లు మీటింగులు ఊరి బయట పెట్టుకోవాలా...? నీవు మాత్రం నీ ఇంట్లో మీటింగులు పెట్టుకుంటావా? అంటూ కేసీఆర్ పై మండిపడ్డారు.
ఊరూర తిరిగి కేసీఆర్ బండారం బయటపెడతానని వీహెచ్ హెచ్చరించారు. కేసీఆర్ కుమారుడు కేటీఆర్, కుమార్తె కవితలు తెలంగాణ ఉద్యమంలో ఎప్పుడు పని చేశారని ప్రశ్నించారు. ఉద్యంమలో లేని కేటీఆర్ ను అంతపైన ఎందుకు పెట్టారని మండిపడ్డారు. ఎవడూ అడిగేవాడు లేడని ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారంటూ కేసీఆర్ పై మండిపడ్డారు. ఇదేమైనా కుటుంబ రాజరిక పాలనా? అని ప్రశ్నించారు.