: యూపీలో అలా చేయ‌డం కాదు.. మాలా చేయండి చూద్దాం!: యూపీ సీఎంకి బీహార్ డిప్యూటీ సీఎం స‌వాల్


ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో కొలువుదీరిన సీఎం యోగి ఆదిత్య‌నాథ్ స‌ర్కారు ఆ రాష్ట్రంలో పోకిరీల ఆట‌లు క‌ట్టించ‌డానికి ‘యాంటీ రోమియో స్క్వాడ్‌’ ఏర్పాటు చేసి ప‌లు చ‌ర్య‌లు తీసుకుంటున్న విష‌యం తెలిసిందే. అయితే, యూపీలో తీసుకుంటున్న ఈ చ‌ర్య‌ల‌పై
బీహార్‌ ఉపముఖ్యమంత్రి తేజస్వీయాదవ్ స్పందిస్తూ... యోగి ఆదిత్య‌నాథ్‌కు ఓ స‌వాలు విసిరారు. యూపీలో ‘యాంటీ రోమియో స్క్వాడ్‌’ పెట్టినట్లు ‘యాంటీ లిక్కర్‌ స్క్వాడ్‌’ పెట్టగలరా? అని నిల‌దీశారు. బీహార్‌లో సీఎం నితీశ్ కుమార్ ప్ర‌భుత్వం సంపూర్ణ మ‌ద్య‌పాన నిషేధం వంటి గొప్ప నిర్ణ‌యం తీసుకొని, దాన్ని అమ‌లుప‌రుస్తోన్న విష‌యం తెలిసిందే. యూపీలో ఏర్ప‌డిన కొత్త ప్ర‌భుత్వం కూడా త‌మలా మ‌ద్య‌పాన నిషేధం విధించాల‌ని ఆయ‌న అన్నారు.

మ‌ద్యం ఎంతో ప్ర‌మాద‌క‌ర‌మైంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఆరోగ్యాన్ని, స‌మాజాన్ని పాడుచేసే మ‌ద్యంపై నిషేధం విధించాలి కానీ, ఇటువంటి వాటితో ప్ర‌జ‌ల దృష్టిని మ‌ర‌ల్చ‌కూడ‌ద‌ని తేజస్వీయాదవ్ హిత‌వు ప‌లికారు. చివ‌ర‌కు యోగి ఆదిత్యనాథ్‌ ఒక యోగి, మతం పట్ల నిజాయతీగా ఉంటారని ఆయ‌న అన్నారు.

  • Loading...

More Telugu News