: ఆ ప్రజెంటేషన్ ‘బాహుబలి’ గ్రాఫిక్స్‌లా ఉంది: రోజా
ఆంధ్రప్రదేశ్ నవ్యరాజధాని మోడల్స్‌పై ప్రభుత్వం ఈ రోజు శాసనసభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఆ ప్రజెంటేషన్‌ను వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే రోజా బాహుబలి సినిమా గ్రాఫిక్స్‌తో పోల్చారు. ఆ చిత్రంలో చూపించిన గ్రాఫిక్స్‌లా ఈ ప్రజంటేషన్ను చూపించి ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతోందని ఆమె అన్నారు. ఇంకా ఖరారు కాని డిజైన్లను శాసనసభలో చూపించడం ఏంటని ఆమె ప్రశ్నించారు. ప్రభుత్వం చూపిస్తోన్న డిజైన్లలో 51శాతం గ్రీనరీకి ప్రాముఖ్యతనిస్తామని అంటున్నారని, అయితే, మూడు పంటలు పండే భూముల్ని దోచుకుని వాటిని సర్వ నాశనం చేసి, ఆ స్థానంలో ప్లాస్టిక్ మొక్కలను మొలిపిస్తామనేలా మాట్లాడుతున్నారని ఆమె ధ్వజమెత్తారు.