: స్మిత్ ను అవుట్ చేసి...ప్రపంచ రికార్డు నెలకొల్పిన అశ్విన్
టీమిండియా స్టార్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ ఒక సీజన్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. 2007/08 క్రికెట్ సీజన్ లో ఒక సీజన్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా డేల్ స్టెయిన్ 78 వికెట్లతో నెలకొల్పిన ప్రపంచ రికార్డును ఇటీవల జరిగిన రాంచీ మ్యాచ్ లో అశ్విన్ సమం చేసిన సంగతి విదితమే. తాజాగా హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాల వేదికగా బోర్డర్ అండ్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న చివరి టెస్టులో సెంచరీ చేసి రాణించిన ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ (111) వికెట్ తీసి ఒక సీజన్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా రవిచంద్రన్ అశ్విన్ (79) ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ సీజన్ లో అద్భుతంగా రాణించిన అశ్విన్ 79 వికెట్లు తీయడం విశేషం. బౌలర్లు గాయాలు, ఫామ్ లేమితో ఇబ్బంది పడే రోజుల్లో ఒక సీజన్ లో 79 వికెట్లు తీయడం అరుదైన విషయం.