: గంటా ఇంట్లో దొంగతనం... పరువు పోతుందని మౌనం?


ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు నివాసంలో దొంగతనం జరిగిందంటూ వైజాగ్ లో వార్తలు గుప్పుమన్నాయి. ఎంవీపీ కాలనీ సెక్టార్‌–4లోని గంటా నివాసంలో ఎవరూ లేని సమయంలో అర్ధరాత్రి ఇంట్లో వెనుక వైపు నుంచి ప్రవేశించిన దొంగలు... బుద్ధుడి ప్లాటినం విగ్రహం, ఒక హారం, నెక్లెస్‌ ను తీసుకుపోయినట్టు తెలుస్తోంది. అయితే, ఈ ఘటనపై తమకెలాంటి ఫిర్యాదు అందలేదని ఎంవీపీ జోన్‌ సీఐ మళ్ల మహేష్‌ తెలిపారు. కాగా, మంత్రి నివాసంలో దొంగతనం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేస్తే పరువు పోతుందన్న ఉద్దేశంతోనే చేయలేదని వార్తలు వెలువడుతున్నాయి. మరోవైపు మంత్రి కుటుంబం ఊర్లో లేని సమయంలో ఈ ఘటన జరగడంతో మంత్రి ఆనుపానులు తెలిసిన వారే ఈ చోరీకి పాల్పడి ఉండవచ్చన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. 

  • Loading...

More Telugu News