: రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద వీహెచ్ ధర్నా.. అరెస్ట్ చేసిన పోలీసులు


కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు ధర్నా చేపట్టారు. హైదరాబాదులోని సోమాజిగూడ రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద ఆయన నిరసనకు దిగారు. తనపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలంటూ ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ క్రమంలో, వీహెచ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు పీఎస్ కు తరలించారు. రెండు రోజుల క్రితం అసెంబ్లీ ఆవరణలో మీడియా పాయింట్ వద్దకు వచ్చిన వీహెచ్ ను ఓ సీఐ అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనపై వీహెచ్ దుర్భాషలాడారు. ఈ నేపథ్యంలోనే, ఆయనపై కేసు నమోదైంది. 

  • Loading...

More Telugu News