: ఎన్నికలకు సిద్ధం కండి.. ఎన్నికల మూడ్ తోనే పని చేయండి: నరేంద్ర మోదీ


ఎన్నికలకు పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలంటూ గుజరాత్, రాజస్థాన్ లకు చెందిన బీజేపీ ఎంపీలకు ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. నిన్న వీరందరికీ మోదీ అల్పాహార విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ఈ రెండు రాష్ట్రాలకు త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై ఆయన చర్చించారు. ఎంపీలంతా ఎన్నికలకు పూర్తి స్థాయిలో సిద్ధం కావాలని మోదీ చెప్పారు. ఇక నుంచి ప్రతి క్షణం ఎన్నికల మూడ్ తోనే పని చేయాలని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాలను పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎంపీలకు ఆయన చెప్పారు. ఇదే సమయంలో గోవా, అండమాన్ నికోబార్, డామన్ డయ్యూ ఎంపీలతో కూడా మోదీ భేటీ అయ్యారు. అయితే గుజరాత్, రాజస్థాన్ ఎంపీలతోనే ఆయన ఎక్కువ సమయం గడిపారు. ఉత్తరప్రదేశ్ ఎంపీలతో కూడా ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు మోదీ ఇదే విధంగా భేటీ అయి, వారికి మార్గనిర్దేశం చేశారు. 

  • Loading...

More Telugu News